Sunday, December 22, 2024

‘బలగం’ విశ్వ విజయ శతకం

- Advertisement -
- Advertisement -

ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌ రామ్‌, సుధాకర్‌ రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా బలగం. దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై హర్షిత్‌ రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ సినిమాకు వేణు ఎల్దండి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా వంద అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ సందర్భంగా విశ్వ విజయ శతకం ఈవెంట్‌ను నిర్వహించారు.

దిల్ రాజు మాట్లాడుతూ.. ‘నేను ఎన్నో వంద రోజుల ఫంక్షన్‌లు చూశాను.. వంద కోట్ల పోస్టర్‌ను చూశాను. కానీ మొదటి సారి ఇలా వంద అవార్డుల ఫంక్షన్‌ను చూస్తున్నాం. ఈ కథను మా దగ్గరకు తీసుకొచ్చిన వేణుకి, వేణుని మా దగ్గరికి తీసుకొచ్చిన ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్ శివరాంకు థాంక్స్. వేణు వెళ్లి శివరాంకు కథ ఎందుకు చెప్పాడో.. ఆయన నా దగ్గరకు ఎందుకు తీసుకొచ్చాడో.. బలగం ఈ రోజు ఇంత పెద్ద హిట్ అయిందంటే కారణం వాళ్లే. వేణుతో పని చేసిన టీంకు థాంక్స్. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్.

చిన్న సినిమా అయినా కూడా మనసుకు హత్తుకుని పని చేశారు. వాళ్లందరికీ థాంక్స్. నటీనటులందరికీ థాంక్స్. వాళ్లంతా నటించలేదు. జీవించారు. అందుకే ఇంత అద్భుతమైన విజయం వచ్చింది. అందుకే వంద అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. మళ్లీ ఇలాంటి అద్భుతాలు జరుగుతాయో లేదో తెలిదు. అందుకే ఈ రోజు ఇలా ఈవెంట్ చేసుకుంటున్నాం. బలగం సినిమాను మీడియాకు చూపించాను. నా ఇరవై ఏళ్లలో ఎప్పుడూ చూడని రియాక్షన్ ఆ రోజు మీడియా వారిలో చూశాను. బాహుబలి, ఆర్ఆర్ఆర్ అనేవి అద్భుతాలు. పెద్ద బడ్జెట్‌లతో రాజమౌళి తెరకెక్కించాడు. ప్రపంచ వ్యాప్తంగా పేరు వచ్చింది. కానీ ఈ బలగం చిన్న ఊర్లో నేటివిటీతో తీశాం. ఈ సినిమాకు అంతర్జాతీయంగా వంద అవార్డులు వచ్చాయి. ఫ్యామిలీ సినిమాలు ఆడతాయా? అని అందరూ అనుకుంటూ ఉంటారు.

సామజవరగమన, బేబీ వంటివి హిట్ అయ్యాయి. చిన్న సినిమాలు ఆడతాయనే నమ్మకం వచ్చింది. కొత్త ఊపిరి వచ్చినట్టు అయింది. మా పిల్లలకు ఇది మొదటి సినిమా. మేం ఎంతో కష్టపడి జర్నీ చేసి వచ్చి హిట్లు కొట్టాం. కానీ వాళ్లు మొదటి సినిమాతో హిట్లు కొట్టారు. వంద అంతర్జాతీయ అవార్డులు సాధించారు. అది చాలా గ్రేట్. మాకు ఇంత వరకు ఒక్క ఇంటర్నేషనల్ అవార్డు కూడా రాలేదు. ఇలాంటి మంచి సినిమా మళ్లీ తీస్తారో లేదో అని మొదటి రోజే చెప్పాను. ఇదొక అద్భుతమైన సినిమా అని మొదటి రోజే అర్థమైంది. మళ్లీ ఇలాంటి గొప్ప చిత్రాలు తీయాలి. ప్రయత్నం చేస్తూనే ఉండాలి. జబర్దస్త్ షోలో కామెడీ చేసుకునేవాడికి డైరెక్షన్ చాన్స్ ఇచ్చి ఇంత మంచి సినిమా తీశారా? అని అడిగేవాళ్లు.

ఈ సినిమాలో నెగెటివిటీ యాంగిల్‌ను ఎక్కడా చూపించలేదు. మానవసంబంధాలను పట్టుకుని ఈ సినిమాను తీశాడు వేణు. గొడవలు లేని కుటుంబం ఉండదు. కానీ మానవసంబంధాలు ఎంత గొప్పవో కాకి రూపంలో చెప్పడమే వేణు సక్సెస్. ఫ్యామిలీ సినిమాలంటే దిల్ రాజు బ్యానర్ నుంచి వస్తాయని తెలుసు. మా పిల్లలకు కూడా ఇంత మంచి సినిమా ఇచ్చిన వేణుకి థాంక్స్. మీ అందరి మీద ఇప్పుడు చాలా పెద్ద బాధ్యత ఉంది. బలగం అయిపోయింది. మరో బలగం లాంటి సినిమా తీయాలి. కష్టపడితేనే ఇలాంటి సినిమాలు వస్తాయి. వేణు, హన్షిత, హర్షిత్‌లకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

హన్షిత మాట్లాడుతూ.. ‘నేను, అన్న కలిసి స్టార్ట్ చేసిన ప్రొడక్షన్‌లో చేసిన మొదటి సినిమా బలగం. ఇంత పెద్ద విజయం సాధిస్తుందని అనుకోలేదు. మేం ఇంత వరకు వంద రోజుల ఫంక్షన్, `175 రోజుల ఫంక్షన్‌కు వెళ్లాం. కానీ ఇలా అంతర్జాతీయంగా వంద అవార్డులు రావడం, ఇలా ఫంక్షన్ చేయడం ఇదే మొదటి సారి. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

వేణు యెల్దండి మాట్లాడుతూ.. ‘మూలాల్లోంచి రాసుకున్న కథ, అంతే సహజంగా తీయాలని అనుకున్నాను. అందుకే ప్రపంచంలో ఉన్న సినిమాలన్నీ చూశాను. అవార్డులు వచ్చిన సినిమాలు చూశాను. కానీ నా సినిమాకే వంద అవార్డులు వచ్చాయి. బలగం సినిమాకు మొదటి హీరో దిల్ రాజు. ఆయన నమ్మడం వల్లే ఈ సినిమా స్టార్ట్ అయింది. నా దృష్టిలో ఆయనే హీరో. చిన్న సినిమాను నమ్మి పెద్ద ఎత్తుకు తీసుకెళ్లారు. శిరీష్ గారు, హన్షిత, హర్షిత్ గార్లకు థాంక్స్. సినిమా రిలీజై నాలుగు నెలలు అవుతున్నా కూడా హ్యాంగ్ అవుట్ పోవడం లేదు.

ఏదో ఒక ఈవెంట్ చేస్తూనే ఉన్నాం. సినిమాకు సపోర్ట్ చేసిన మీడియాకు థాంక్స్. నా నటీనటులందరికీ థాంక్స్. కొరియోగ్రఫర్ శంకర్ మాస్టర్ ఎంత బిజీగా ఉన్నా నా కోసం వచ్చారు. శంకర్, భాను, గణేష్ మాస్టర్లకు థాంక్స్. మిక్సింగ్ కృష్ణ, మిక్సింగ్ ఎతి రాజ్ గారికి థాంక్స్. నా డైరెక్షన్ టీం రమేష్‌, అరుణ్, ప్రశాంత్, సాయి, ఉపేంద్ర, బాలు అందరికీ థాంక్స్. నా కెమెరామెన్ వేణు, కర్ణలకు థాంక్స్. ప్రారంభంలో తెలంగాణ సినిమా అని అంతా ప్రచారం చేశారు. కానీ ఇది తెలుగు సినిమా. అమెరికా, రాయలసీమ ఇలా అందరూ ఆదరించారు. సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. కాసర్ల శ్యామ్ అందించిన పాటలకు, భీమ్స్ ఇచ్చిన మ్యూజిక్‌కు, సురేష్ బొబ్బిలి ఇలా అందరికీ థాంక్స్. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

కావ్యా కళ్యాణ్‌ రామ్ మాట్లాడుతూ.. ‘వంద రోజులు సినిమాలు ఆడటం అనేది మరిచిపోయాం. కానీ ఓ సినిమాకు వంద అవార్డులు రావడం అంటే మామూలు విషయం కాదు. ఇంత మంచి సినిమా తీసిన వేణు గారికి హ్యాట్సాఫ్. నిర్మాతలు ఏ విజన్‌తో ఈ సినిమాను తీశారో, నమ్మారో నాకు తెలియడం లేదు. ఇంత మంచి నిర్మించినందుకు నిర్మాతలకు థాంక్స్. బలగం ఫ్యామిలీకి థాంక్స్. బలగం సినిమా సెలెబ్రేషన్స్‌కు అంతం ఉండదు. రెండు వందల అవార్డులు వచ్చిన తరువాత మళ్లీ కలుద్దామ’ని అన్నారు.

ప్రియదర్శి మాట్లాడుతూ.. ‘బలగం సినిమాతో అనుబంధం ఉన్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్. టీం వర్క్‌తోనే ఇలాంటి సక్సెస్ వస్తుందనేదానికి నిదర్శనం ఈ సినిమా. హైద్రాబాద్‌ అపార్ట్మెంట్‌ల నుంచి ఊర్లో అందరూ స్క్రీనింగ్ వేసుకుని చూశారు. ఇలాంటిది కేవలం బలగం సినిమాకే జరిగింది. తెలుగు సినిమా గురించి రాయాలన్నా, చెప్పుకోవాలన్నా కచ్చితంగా బలగం సినిమా గురించి చెప్పుకుంటారు. వంద అవార్డులు రావడం అనేది మామూలు విషయం కాదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ తరువాత ఈ ప్రపంచానికి బలగం సినిమాను పరిచయం చేశాం. దీనికి కారణమైన వేణు అన్నకి థాంక్స్. హర్షిత, హన్సిత, దిల్ రాజు గారు, శిరీష్‌ గారికి థాంక్స్. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. జాతీయ అవార్డు వచ్చాక మళ్లీ ఓ వేదిక మీద మాట్లాడతాను’ అని అన్నారు.

కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ.. ‘బలగం సినిమాకు పాట రాయడంతో అందరికీ నా మీద గౌరవం పెరిగింది. పెద్ద వాళ్లు కూడా కాళ్లు మొక్కేందుకు వస్తున్నారు. చావు దగ్గరికి వెళ్తే కూడా సెల్ఫీలు అడుగుతున్నారు. ఇలాంటి సినిమాలో పాటలు రాసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. మా ఇండస్ట్రీలో నాకు ఉన్న బలగం దిల్ రాజు. ఈ సినిమా అందరికీ గౌరవాన్ని తీసుకొచ్చింది. అంతర్జాతీయంగా వంద అవార్డులు వచ్చాయి. మంచి సంగీతాన్ని అందించిన భీమ్స్‌కు థాంక్స్’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News