- Advertisement -
హైదరాబాద్: బలగం సినిమాలో నటించిన ప్రముఖ జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూశారు. గత కొన్ని రోజులగా రెండు మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవడంతో వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మొగిలయ్య తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మొగిలయ్య చికిత్స అయ్యే ఖర్చును దర్శకుడు వేణు యెల్దండి, సినిమా బృందంతో పాటు ప్రభుత్వం కూడా బరించింది. వారంలో రెండు సార్లు డయాలసిస్ చేయడంతో పాటు ఆయనకు గుండె సంబంధిత సమస్యలు రావడంతో చనిపోయారని వైద్యులు తెలిపారు. బలగం సినిమాలో తన గాత్రంతో ప్రేక్షకులను కంటతడి పెట్టించారు.
- Advertisement -