Wednesday, January 22, 2025

బంధాలు, అనుబంధాలు గుర్తుకుతెచ్చే చిత్రం..

- Advertisement -
- Advertisement -

దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మిస్తోన్న సినిమా ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. వేణు ఎల్దండి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ‘బలగం’ సినిమాను రిలీజ్ చేయడానికి నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో సినిమాలోని పాత్రలను పరిచయం చేశారు ఫిల్మ్‌మేకర్స్. ఈ సందర్భంగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ “బలగం సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం.

ఇప్పటికే విడుదలైన ఊరు పల్లెటూరు, పొట్టి పిల్ల పాటలకు మంచి స్పందన వస్తోంది. త్వరలోనే మరో రెండు పాటలను విడుదల చేస్తాం. ఈ పాటలు ఎంతో గొప్పగా ఉంటాయి. హీరోహీరోయిన్లు దర్శి, కావ్య అద్భుతంగా నటించారు. తెలంగాణకు చెందిన పల్లెటూరిలో జరిగే కథతో రూపుదిద్దుకున్న ఈ సినిమా అందరికీ బాగా నచ్చుతుంది. కుటుంబంలోని బంధాలు, అనుబంధాలు గుర్తుకువస్తాయి”అని అన్నారు. దర్శకుడు వేణు ఎల్దండి మాట్లాడుతూ “త్వరలోనే బలగం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. భీమ్స్ సంగీతంతో కాసర్ల శ్యామ్ సాహిత్యంతో పాటలు చక్కగా రూపుదిద్దుకున్నాయి”అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News