Friday, January 10, 2025

పలు రాష్ట్రాల్లో టిటిడి ఆధ్వర్యంలో బాలాజీ ఆలయాల నిర్మాణం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మించాలని టిటిడి ప్రణాళికలు రూపొందించింది. దీనికి సంబంధిం తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్రాల్లోనూ, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ బాలాజీ దేవాలయాలు నిర్మించాలని నిర్ణయించింది. ఈ నెలలో ఇప్పటికే జమ్మూ నగర శివారుల్లో శ్రీవారి భక్తుల కోసం తిరుపతి బాలాజీ దేవాలయాన్ని టిటిడి ప్రారంభించగా, జమ్మూలోని శివాలిక్ అడవుల దిగువన 62 ఎకరాల విస్తీర్ణంలో శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని టిటిడి నిర్మించింది.

తాజాగా ఛత్తీస్‌ఘఢ్, గుజరాత్ రాష్ట్రాల్లో శ్రీ వెంకటేశ్వర దేవాలయం నిర్మాణానికి కార్యాచరణ ప్రణాళికను టిటిడి పరిశీలిస్తోంది. బీహార్‌లో బాలాజీ దేవాలయం నిర్మాణం విషయమై ఇప్పటికే ఆ రాష్ట్ర సిఎం నితీశ్ కుమార్‌తో టిటిడి సంప్రదింపులు జరుపుతోంది. నేవీ ముంబైలో బాలాజీ దేవాలయం నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాల భూమి కేటాయించగా ఈ ఆలయం నిర్మాణానికి టిటిడి రూ.70 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News