Sunday, December 22, 2024

ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొ. బాలకృష్ణారెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:గత కొంత కాలం గా ఖాళీగా ఉన్న తెలంగాణ ఉన్నత విద్యా మం డలి చైర్మన్ పోస్టును ప్రభుత్వం భర్తీ చేసింది. ఈ క్రమంలో ప్రొఫెసర్ బాలకృష్టారెడి ్డని ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా, వైస్ చైర్మన్‌గా ప్రొ ఫెసర్ ఇటిక్యాల పురుషోత్తంలను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరు ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగను న్నారని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. వీరి నియా మకం తక్షణమే అమలులోకి వ స్తుం దని పేర్కొ న్నారు. ప్రొఫెసర్  బాలకిష్టారెడ్డి ప్రస్తుతం నల్సార్ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్నారు.

అలాగే రాష్ట్రంలోని పలు యూనివర్సిటీల ఇంఛార్జ్ వీసీలను సైతం మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇటీవల చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా ఏర్పడిన కోటి మహిళా కళాశాలకు ఇంఛార్జి విసిగా ధనావత్ సూర్యను, బాసర ఐఐఐటీ ఇంఛార్జి వీసీగా ప్రొఫెసర్ గోవర్ధన్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ మహిళా యూనివర్సిటీ ఇంఛార్జ్ వీసీగా నియామకం అయిన ధనవాత్ సూర్య ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ ఆరట్స్ కళాశాల తెలుగు విభాగంలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News