Thursday, January 23, 2025

క్రేజీ కాంబోలో నాలుగవ సినిమా

- Advertisement -
- Advertisement -

గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్‌లను పూర్తి చేసి ఇండియన్ సినిమా క్రేజీ కాంబినేషన్‌లలో ఒకటిగా నిలిచారు. అత్యధిక వసూళ్లు రాబట్టిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలతో హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్‌లను అందించిన తర్వాత ఈ మాసీవ్ ఎపిక్ కాంబో మళ్లీ చేతులు కలిపింది. వీరిద్దరూ నాలుగోసారి జత కడుతున్నారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ‘బిబి4’ సినిమాను సోమవారం ఎన్‌బికె పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

’లెజెండ్’ సినిమా నిర్మాణ భాగస్వాములైన రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఎం తేజస్విని నందమూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో ఒక మాసీవ్ రథచక్రం పవర్ ఫుల్ గా కనిపించింది, నెంబర్ 4ని రుద్రాక్ష బ్రాస్‌లెట్‌తో కట్టిబడివుంది. పోస్టర్ లో ఎర్రటి సూర్యుడు, పడుతున్న తోకచుక్కలు చూస్తుంటే నందమూరి హీరోతో మాస్ డైరెక్టర్ ఈసారి ఎలాంటి సినిమా తీయబోతున్నాడో తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగిస్తుంది.

‘ఎన్‌బికె109’ నుండి ప్రత్యేక గ్లింప్స్…
వరుస విజయాలతో దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ తన 109వ చిత్రం ‘ఎన్‌బికె109’తో మాస్ ని అలరించడానికి బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లితో చేతులు కలిపారు. తెలుగు చిత్రసీమలో అత్యంత విజయవంతమైన నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తోంది. సోమవారం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా.. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక గ్లింప్స్ ను విడుదల చేశారు నిర్మాతలు. ‘జాలి, దయ, కరుణ లాంటి పదాలకు అర్థం తెలియని అసురుడు‘ అంటూ పవర్ ఫుల్ డైలాగ్ తో బాలకృష్ణ పాత్రను పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంది.

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 8న ’ఎన్‌బికె109’ నుండి ఇప్పటికే చిత్ర బృందం ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేయగా విశేష స్పందన లభించింది. ఇక ఇప్పుడు బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక గ్లింప్స్ మరింత ఆకర్షణగా ఉంది. సంచలన స్వరకర్త ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News