Thursday, January 23, 2025

అనిల్ రావిపూడితో భారీ బడ్జెట్ మూవీ

- Advertisement -
- Advertisement -

Balakrishna first look released

నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్ గోపీచంద్ మలినేని, అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాలను చేసేందుకు కమిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య 107వ సినిమా ముగింపు దశకు వచ్చింది. త్వరలోనే బాలయ్య 108వ సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో పట్టాలెక్కబోతుంది. వీరిద్దరి కాంబో సినిమా గురించిన ఆసక్తికర చర్చ జరుగుతోంది. బాలయ్యతో అనిల్ రావిపూడి చేయబోతున్న ఈ సినిమాకు గాను దాదాపుగా 75 కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గతంలో మహేష్ బాబుతో తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు సినిమా కంటే కూడా అధిక బడ్జెట్‌ను బాలయ్య 108వ సినిమా కోసం అనిల్ రావిపూడి ఖర్చు చేయబోతున్నాడనే సమాచారం. ఇప్పటి వరకు అనిల్ రావిపూడి కెరీర్ లోనే ఏ సినిమాకు చేయని ఖర్చును ఈ సినిమా కోసం చేయించబోతున్నాడట. కథానుసారంగా ఈ సినిమా కాస్త ఎక్కవ బడ్జెట్ ను కోరుకుంటుందని.. అందుకే ఈ సినిమా కోసం దర్శకుడు కాస్త ఎక్కువగానే ఖర్చు చేయించబోతున్నాడట. బాలయ్య కెరీర్‌లో కూడా ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లోకి ఈ సినిమా కాస్త ఎక్కువ బడ్జెట్ సినిమాగా నిలుస్తుందని అంటున్నారు. ఇదే ఏడాది చివరి నుండి సినిమాను ప్రారంభించి వచ్చే ఏడాదిలో సినిమాను విడుదల చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News