- Advertisement -
నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు అంటే అభిమానులకు పెద్ద పండగ. ప్రతి ఏడాది ఆయన పుట్టినరోజైన జూన్ 10న… తమ అభిమాన కథానాయకుడిని కళ్లారా చూసేందుకు, మనసారా కలిసేందుకు ప్రజలందరూ హైదరాబాద్‌కు తరలి వస్తుంటారు. కరోనా నేపథ్యంలో అభిమానులు అందరూ ఆరోగ్యంగా ఉండటమే తనకు ముఖ్యమని, అందువల్ల ఎవరూ తనను కలవడానికి రావద్దని బాలకృష్ణ సవినయంగా తెలియజేశారు.నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ “నా ప్రాణ సమానులైన అభిమానులకు… ప్రతి ఏటా జూన్ 10న నా పుట్టినరోజు నాడు నన్ను కలిసేందుకు నలుదిక్కుల నుండి తరలివస్తున్న మీ అభిమానానికి సర్వదా విధేయుడిని. కానీ కరోనా విలయతాండవం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో మీరు రావటం అభిలషణీయం కాదు. మీ కుటుంబంతో మీరు ఆనందంగా గడపటమే నా జన్మదిన వేడుక. దయచేసి రావద్దని మరీ మరీ తెలియజేస్తున్నాను” అని అన్నారు.
- Advertisement -