టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన నందమూరి బాలకృష్ణ్ణ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించిన ఏకైక సినిమా ‘సుల్తాన్’. 1999లో వచ్చిన ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేశారు. అందులో ఒకటి విలన్ రోల్. క్లైమాక్స్‌లో మంచిగా మారి చనిపోయే పాత్ర అది. ఆ తర్వాత బాలయ్య అలాంటి పాత్రల జోలికి వెళ్ళలేదు. అయితే ఇప్పుడు మరోసారి నెగెటివ్ క్యారక్టర్ చేస్తున్నారని తెలిసింది. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ హై ఇంటెన్స్ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ లో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నారు. అధికారికంగా చెప్పకపోయినా ఈ స్టార్ హీరో రెండు పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. అయితే అందులో ఒక పాత్ర నెగిటివ్ షేడ్స్‌లో ఉంటుందని.. అది చాలా పవర్‌ఫుల్ రోల్ అని తెలిసింది.
ఇప్పటికే ఒక క్యారెక్టర్‌కు సంబంధించిన బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మైనింగ్ ప్రాంతంలో పంచె కట్టులో బ్లాక్ షర్ట్ ధరించి బాలయ్య సరికొత్తగా కనిపించారు. ఇది నెగెటివ్ రోల్ అయి ఉండొచ్చని అంటున్నారు. ఇందులో తమిళ విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఆ పాత్రకు చెల్లిగా కనిపించనుంది. ఇక బాలయ్య నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడమనేది ఆసక్తికరమైన విషయం. ఒకవేళ ఇదే నిజమే అయితే.. దాదాపు 23 ఏళ్ల తర్వాత మళ్ళీ అలాంటి రోల్‌లో చూసే అవకాశం అభిమానులకు దక్కుతుంది. ఇందులో బాలకృష్ణ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.
Balakrishna dual role in NBK 107