Monday, December 23, 2024

రగ్డ్ లుక్‌లో…

- Advertisement -
- Advertisement -

Balakrishna first look released

 

నటసింహా నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపిచంద్ మలినేనిల ఫస్ట్ క్రేజీ కాంబినేషన్‌లో పక్కా మాస్ కమర్షియల్ అంశాలతో ఓ భారీ చిత్రం రూపొందుతోంది. ఈ యాక్షన్ ప్యాక్ట్ ఎంటర్‌టైనర్‌లో బాలయ్యను ఇంతవరకు చూడని సరికొత్త రూపంలో చూపించనున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఈ మూవీ ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లింది. తాజాగా ఈ సినిమాలోని బాలకృష్ణ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో రగ్డ్ లుక్‌లో మెడలో రుద్రాక్ష మాలతో బాలకృష్ణ స్టైలిష్‌గా నడుచుకుంటూ వస్త్తున్నారు.

ఈ పోస్టర్‌లో ఆయన నల్ల చొక్కా , గోధుమ రంగు పంచె ధరించాడు. మొత్తంమీద బాలకృష్ణ లుక్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ప్రస్తుతం సిరిసిల్లలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ పోస్టర్‌లోని ఫైట్ సీక్వెన్స్‌ను రామ్ -లక్ష్మణ్ మాస్టర్స్ రూపొందిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలోని ప్రతి నాయకుడి పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నాడు. బాలకృష్ణ 107వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం వరలక్ష్మీని ఎంపిక చేసుకున్నారు. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News