Saturday, March 22, 2025

సంగీత దర్శకుడు తమన్‌కు బాలయ్య సర్‌ప్రైజ్

- Advertisement -
- Advertisement -

నటసింహం బాలకృష్ణ, సంగీత దర్శకుడు తమన్‌ల కాంబినేషన్ ఎంత సూపర్ హిట్టో అందరికి తెలిసిందే. వీళ్ల కాంబోలో వచ్చిన ప్రతీ సినిమా మ్యూజిక్ సూపర్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా బాలయ్య యాక్షన్‌కు థమన్ కొట్టే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కి థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే. ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కి కొన్ని థియేటర్లలో స్పీకర్లు కూడా కాలిపోయాయి. ఆ వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి కూడా. అయితే తాజాగా బాలకృష్ణ థమన్‌కు ఓ అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు.

థమన్‌కు ఆయన ఖరీదైన పోర్షే కారును బహుమానంగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై తాజాగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘తమన్ నాకు తమ్ముడితో సమానం. వరుసగా నాకు నాలుగు హిట్లు ఇచ్చాడు. అందుకే ప్రేమతో అతనికి కారును బహుమతిగా ఇచ్చాను. భవిష్యత్తులోనూ మా ప్రయాణం ఇలాగే కొనసాగాలి’ అని అన్నారు.

బాలయ్య నటించిన ‘డిక్టేటర్’ సినిమా మొదలు ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’, తాజాగా ‘డాకు మహరాజ్’ సినిమాలకు తమన్ సంగీతం అందించారు. ఈ సినిమాలన్ని బ్లాక్‌బస్టర్లు అయ్యాయి. దీంతో తమిళ ఇండస్ట్రీలో రజనికాంత్‌కు అనిరుధ్ ఉన్నట్లు తెలుగులో బాలకృష్ణకు తమన్ అంటూ తాజాగా ఓ షోలో తమన్ అన్నారు. ఇక బోయపాటి-బాలకృష్ణ కాంబోలో వస్తున్న ‘అఖండ-2’ సినిమాకు కూడా తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టైటిల్ టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News