Monday, January 20, 2025

బాలయ్యా.. యు ఆర్ గ్రేట్

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: సినిమా పరిశ్రమ చాలా చిత్రమైనది. వయసు మీదపడినా హీరోలకు స్టార్‌డమ్ చెక్కుచెదరదు. అదే హీరోయిన్ల విషయానికి వస్తే పెళ్లయితే చాలు కెరీర్‌కు బ్రేక్ పడినట్లే. పెళ్లయి, తల్లిగా మారిన హీరోయిన్లకు అక్క, వదిన వంటి పాత్రలతో సరిపెట్టుకోవలసి వస్తుంది. గ్లామర్ పాత్రలకు దూరం కాక తప్పదు. ఈ విషయంలో కాజల్ అగర్వాల్‌కూ అదే పరిస్థితి ఎదురైనప్పటికీ లక్కు మాత్రం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. ఆచార్య చిత్రంలో చిరంజీవితో కలసి కొన్ని సిన్నివేశాల్లో నటించినప్పటికీ బిడ్డ తల్లి అయిన కారణంగా ఆ చిత్రంలోనుంచి అదర్థంతరంగా తప్పుకోవలసి వచ్చింది.

ఆ తర్వాత హీరోయిన్‌కు అవసరమైన గ్లామర్, ఫిట్‌నెస్ ఉన్నప్పటికీ వెంకటేష్, నాగార్జునతో హీరోయిన్‌గా నటించే అవకాశాలు కూడా ఆమెకు చేజారిపోయాయి. ఆమెతో కలసి నటించేందుకు ఈ ఇద్దరు హీరోలు వెనుకడుగు వేసినట్లు సమాచారం. కాగా.. గోపీచంద్‌తో కూడా కాజల్‌కు అవకాశం మిస్ అయ్యింది. కాని.. నందమూరి బాలకృష్ణ మాత్రం వీటన్నిటికి అతీతుడు. తన పాత్ర తప్ప చిత్ర సిర్మాణంలో ఎటువంటి జోక్యం చేసుకోని నటుడిగా పేరున్న బాలకృష్ణ తన కొత్త చిత్రం భగవంత్ కేసరి చిత్రంలో కాజల్‌కు హీరోయిన్‌గా అవకాశం ఇచ్చేందుకు ముందుకొచ్చారు.

తమ సరసన నటించే హీరోయిన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే చాలామంది హీరోలతో పోలిస్తే బాలకృష్ణ తీరే వేరు. ఆయనకు ఎలాంటి బేషజాలు కాని, అభ్యంతరాలు కాని లేవని మరోసారి ప్రూవ్ అయింది. తన కాజల్‌తో నటించడానికి ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

చిరంజీవితో ఖైదీ నంబర్ 150లో నటించినప్పటికీ ఆ తర్వాత పెళ్లి, ప్రసవంతో కాజల్‌కు అవకాశాలు తగ్గిపోయాయి. మళ్లీ కెమెరా ముందుకు వచ్చేందుకు ఆమె సంసిద్ధతను వ్యక్తం చేసినప్పటికీ వకాశాలు మాత్రం ఆమె ఆశించినంతగా రాలేదు. హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలలో నటించడానికి ఆమె మొగ్గు చూపుతున్న సమయంలో బాలకృష్ణతో నటించే అవకాశం రావడం ఆమెకు మంచి టర్నింగ్ పాయింటేనని చెప్పాలి. టాలెంటెడ్ ఆర్టిస్టులకు అవకాశాలు ఇవ్వడానికి ఎటువంటి రిస్కునైనా ఎదుర్కొనే ధైర్యమున్న బాలకృష్ణతో నటిస్తున్న భగవంత్ కేసరి చిత్రం విడుదల తర్వాత కాజల్‌కు హీరోయిన్‌గా మరిన్ని అవకాశాలు వస్తాయేమో వేచి చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News