Monday, December 23, 2024

సెప్టెంబరు 1న బాలకృష్ణకు సన్మానం

- Advertisement -
- Advertisement -

నందమూరి బాలకృష్ణ 1974 సంవత్సరంలో ఆగస్టు 30న విడుదలైన తాతమ్మ కల సినిమాతో తన సినీ కెరీర్‌ను హీరోగా ప్రారంభించి, హీరోగా తన కెరీర్‌లో 50 ఏళ్ల తర్వాత కూడా సినిమా ఇండస్ట్రీలో హ్యాట్రిక్ హిట్లతో హీరోగా కొనసాగుతున్నాడు. ఆయన గోల్డెన్ జూబ్లీ సినీ హీరో. రాజకీయ రంగంలో ఆయన వరుసగా మూడు పర్యాయాలు ఏపి శాసనసభకు ఎన్నికై హిందూపూర్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించారు.

ఇప్పుడు సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న హైదరాబాద్‌లోని బసవ తారకం ఇండో -బ్రిటీష్ క్యాన్సర్ హాస్పిటల్‌కు ఆయన చైర్మన్‌గా ఉన్నారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ తన సినీ కెరీర్‌ను 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కె.ఎల్.దామోదర్ ప్రసాద్, సునీల్ నారంగ్, టి. ప్రసన్న కుమార్, వల్లభనేని అనిల్ ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియచేస్తూ సెప్టెంబరు 1న తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆయనకు సన్మానం చేయబోతోందనీ, అందుకు అంగీకరించాల్సిందిగా అభ్యర్ధించారు. భారతీయ సినిమా, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఈ సన్మాన సభలో పాల్గొంటారు. నందమూరి బాలకృష్ణ వారి అభ్యర్థనను అంగీకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News