Monday, January 20, 2025

బాలయ్య సినిమాలో పాట కోసం అన్నీ కోట్లా?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న షైన్ స్క్రీన్ ప‌తాకంపై సాహు గార‌పాటి  చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందిస్తుండగా, ఈ సినిమాలో బాల‌య్య 45 సంవ‌త్సరాలున్న తండ్రి పాత్రలో కనిపించనున్నాడు. పెళ్లిసంద‌డి ఫేం శ్రీలీల బాల‌య్య కూతురుగా నటించనుంది. ఈ చిత్రంలో బాల‌కృష్ణకు జోడీగా కాజల్‌ న‌టించ‌నుంది. ఇప్పుడున్న సీనియర్‌ హీరోలలో బాలకృష్ణ దే హవా నడుస్తుంది. తాజాగా బాలయ్య నటించిన‘అఖండ‘వీరసింహా రెడ్డి’చిత్రాలు భారీ విజయం సాధించాయి. ప్రస్తుతం బాలయ్య హ్యట్రిక్‌ కోసం ట్రై చేస్తున్నాడు.
ఇక బాలయ్య ప్రస్తుతం అనిల్‌ రావిపూడితో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది.ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమాగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. కాగా తాజాగా ఈ సినిమాలోని ఓ పాట సెట్‌ కోసమే మేకర్స్‌ కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తుంది. రామోజీఫిలిం సిటీలో దాదాపు 5 కోట్లతో ఓ భారీ సెట్‌ను రూపొందించారట.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News