Sunday, January 19, 2025

నటుడు ప్రభాస్ త్వరలో ఓ ఇంటివాడవుతాడా?…(వీడియో)

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వయస్సు పెరిగిపోతున్నా ఇంకా పెళ్లి చేసుకోకపోవడంపై ప్రభాస్ అభిమానులకు కుతూహలం ఉంది. కారణం ఏమిటని ఇప్పటికీ చాలా మంది కౌతుకంతో ఉన్నారు. ప్రభాస్ పెళ్లి ఇప్పటికీ ‘హాట్ టాపిక్’ అన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అతడి అభిమానుల్లో, మీడియాలో ఆ టాపిక్ ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ నిర్వహించిన ‘అన్‌స్టాపబేబుల్ షో’ లో ప్రభాస్ పెళ్లి గురించిన చర్చ చోటు చేసుకుంది. అవకాశాన్ని ఏ మాత్రం వదులుకోకుండా బాలకృష్ణ పెళ్లి గురించిన ప్రశ్నను సంధించారు. ‘మీరు అనుష్క శెట్టి, ఇప్పుడు తాజాగా కృతి సనన్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు వదంతులు చక్కర్లు కొడుతున్నాయి…కథ ఏమిటి?’ అని ప్రశ్నించారు.

ఈ రంజయిన ప్రోగ్రామ్‌లో మరో పేరున్న నటుడు రామ్ చరణ్ కూడా చేరాడు. ఫోన్‌లో రామ్‌చరణ్ అనూహ్యమైన ప్రకటన చేశారు. అదేమిటంటే ‘ప్రభాస్ త్వరలో శుభవార్త చెబుతాడు’ అన్నాడు. దానికి ప్రభాస్ సైతం దిగ్భ్రాంతికి గురయ్యాడు. కాగా అప్పుడు బాలయ్య ‘అది కృతి సననా లేక శెట్టినా?’ అని ప్రశ్నించారు. ‘ఫోన్ పెట్టేసేలోగా చెప్పిందానిపై వివరణ ఇవ్వాల్సిందే’ అని ప్రభాస్, రామ్‌చరణ్‌ను వేడుకున్నాడు. దాంతో రామ్‌చరణ్ ‘నేను జోక్ చేశాను’ అని పొంగుతున్న పాలపై నీళ్లు చల్లినంత పనిచేశాడు.

చాలా జోవియల్‌గా జరిగిన పిచ్చాపాటి కార్యక్రమంలో ప్రభాస్ డేటింగ్ వదంతులపై వివరణ ఇస్తూ ‘ఇది చాలా పాత వార్తే సార్, పెళ్లి లాంటిదేమి లేదని ఆ ‘మేడమ్’కూడా వివరణ ఇచ్చారు’ అన్నాడు. ‘సలార్’ సినిమాలో నటిస్తున్న ప్రభాస్ ‘పెళ్లి చేసుకోవాలని ఉంది, కానీ అది ఎప్పుడు జరుగుతుందన్నది నాకూ తెలియదు. నో ఐడియా సార్. నాకు ఇప్పుడయితే తెలియదు. అయితే నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. కానీ అది ఇప్పటికైతే నా నుదుటిలో రాసి లేదు’ అన్నాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News