Monday, December 23, 2024

జగన్‌తో మీటింగ్ కు ఆహ్వానించారు.. రానని చెప్పా: బాలకృష్ణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సినిమా టికెట్ల వివాదంపై ఎపి ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశంపై నందమూరి బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. ”టికెట్స్ రేట్స్ గురించి జగన్‌తో సమావేశానికి నన్ను ఆహ్వానించారు. కానీ ఆ సమావేశానికి నేను రాను అని చెప్పా. ఎందుకంటే నేను నా రెమయూనరేషన్ పెంచను. నా సినిమా బడ్జెట్‌ను పెంచను. బడ్జెట్ పెంచి నిర్మాతను ఇబ్బంది పెట్టను. టికెట్ రేట్స్ మీద అంతకముందే నేను కొన్ని సూచనలు చేశాను. బడ్జెట్ గురించి కూడా ఆలోచించాలని చెప్పాను. తక్కువ టిక్కెట్ ధరలతో అఖండ పెద్ద బ్లాక్‌బస్టర్‌ అయింది. రాజకీయంగా అయితే హిందూపురం కోసం జగన్ ని కలుస్తా. కానీ టికెట్స్ రేట్స్ మీద అయితే కలవను అని చెప్పా” అని బాలయ్య పేర్కొన్నారు.

Balakrishna reacts on Celebs meeting with CM Jagan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News