Monday, December 23, 2024

బాలకృష్ణ రీల్ హీరో…. జగన్ రియల్ హీరో: అంబటి

- Advertisement -
- Advertisement -

అమరావతి: టిడిపి ఎంఎల్‌ఎ బాలకృష్ణ రీల్ హీరో అని, సిఎం జగన్ రియల్ హీరో అని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్కిల్ స్కామ్‌పై ఇవాళ సభలో చర్చ జరిగింది. ఈ సందర్బంగా అంబటి మాట్లాడారు. సభలో తొడలు కొడితే రియల్ హీరోలు అయిపోరని అంబటి ఎద్దేవా చేశారు. అనుచిత ప్రవర్తనతో ప్రవర్తించేవాడు అసలు నటుడే కాదని మండిపడ్డారు. టిడిపోళ్లు నీతిమంతులైతే దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతిపై వివరంగా చర్చిద్దామని, టిడిపి ఎంఎల్‌ఎలు తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. టిడిపికి చితశుద్ధి ఉంటే చర్చకు రావాలని, చంద్రబాబు రూ.370 కోట్లు దోచేసి అడ్డంగా దొరికిపోయారని అంబటి చురకలంటించారు.

Also Read: తిరుమలలో గరుడ వాహన సేవ ప్రారంభం….. తండోపతండాలుగా భక్తులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News