Monday, December 23, 2024

అక్కినేనిపై చేసిన వ్యాఖ్యాలపై స్పందించిన బాలకృష్ణ

- Advertisement -
- Advertisement -

వీరసింహారెడ్డి సక్సెస్ ప్రెస్ మీట్ లో బాలకృష్ణ అక్కినేనిపై చేసిన వ్యాఖ్యాలపై బాలకృష్ణ స్పందించారు. సిని ఇండస్ట్రీకి రెండు కళ్లలాంటి వారు ఎన్టీఆర్, నాగేశ్వర రావు , ఫ్లోలో వచ్చే మాటలను వ్యతిరేకంగా ప్రచారం చేస్తే తనకు సంబంధం లేదని బాలకృష్ణ పేర్కొన్నారు.

నాన్న నేర్పిన క్రమశిక్షణ, అక్కినేని బాబాయ్ నుంచి పొగడ్తలకు దూరం అనే విషయాన్ని నేర్చుకున్నానని బాలకృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ జాతీయ అవార్డును మొదటగా అక్కినేనికి అందించారని , బాబాయ్ పై ప్రేమ గుండెల్లో ఉంటుందని వివరించారు. బాబాయ్ నుంచి ఎంతో నేర్చుకున్నానని, ఆయన పై వ్యతిరేకత ఎందుకు ఉంటుందని, అక్కినేని తన పిల్లల మీద కంటే తన మీద ఎక్కువ ప్రేమ చూపించేవారని బాలకృష్ణ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News