Thursday, January 23, 2025

నిమ్మకూరులో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు..

- Advertisement -
- Advertisement -

Balakrishna to Celebrate NTR 100th birthday at Nimmakuru

తెలుగు ప్రేక్షకులు, ప్రజల గుండెల్లో నందమూరి తారక రామారావు సృష్టించుకున్న స్థానం సుస్థిరమైనది. ఆయన తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అయ్యారు. సినిమా రంగమైనా.. రాజకీయ వేదిక అయినా.. అన్ని చోట్ల కోట్లాది మంది మనసుల్లో నిలిచిపోయిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు ఎన్నేళ్లయినా.. ఎన్నాళ్లైనా ఆ మహానుభావుడు తెలుగు జాతిపై చేసిన సంతకం మరువలేనిది. ఈ నేపథ్యంలో ఈనెల 28 నుండి ఆయన శత జయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు హిందూపురం ఎమ్మెల్యే, నటసింహ నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ఘనంగా జరుగనున్నాయి. స్వర్గీయ నందమూరి తారక రామారావు పుట్టిన ఊరు నిమ్మకూరులో ఈ వేడుకలు ఈనెల 28న ఉదయం బాలకృష్ణ చేతుల మీదుగా అత్యంత ఘనంగా ప్రారంభం కానున్నాయి.

Balakrishna to Celebrate NTR 100th birthday at Nimmakuru

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News