అమరావతి: నిన్న ఎపి అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై హిందుపురం టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నందమూరి కుటుంబ సభ్యులతో కలిసి బాలయ్య మీడియా సమావేశంలో మాట్లాడారు. ”చంద్రబాబుపై వైసిపి నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడం ఎప్పుడూ చూడలేదు. భువనేశ్వరిపై వ్యక్తిగత విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. మేం చేతులు కట్టుకుని కూర్చోలేదు. పర్సనల్ ఎజెండాతో మా కుటుంబసభ్యులను కించపరిచారు. మా ఆడవాళ్ళ జోలికి వస్తే ఊరుకునేది లేదు. ఇన్నాళ్లూ చంద్రబాబును చూసి సహనంతో ఉన్నాం. ఇకపై చంద్రబాబు అనుమతి మాకు అవసరం లేదు. ఖబడ్దార్.. మెజార్టి ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా, ఇకపై నీచ, నికృష్ట పదజాలం వాడినా ఒక్కొక్కరి భరతం పడతాం. నోరు అదుపులో పెట్టుకోవాలి, మళ్ళీ ఇంకోసారి ఇలా వాగితే… మీరు అడ్డం పెట్టుకొన్న ఏ వ్యవస్థనైనా బద్దలు కొట్టుకు వస్తాం. ఇష్యూ గురించి మాట్లాడాలి.. కానీ రాజకీయాలతో సంబంధం లేని ఆడవాళ్ల గురించి మాట్లాడుతారా?. గొడ్ల చావిట్లో ఉన్నామా, అసెంబ్లీలో ఉన్నామా అన్న అనుమానం కలుగుతోంది. అసెంబ్లీలో సవాళ్లు, ప్రతిసవాళ్లు అనవాయితే. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీలో వ్యక్తిగత విమర్శలు మంచిదికాదు. స్పీకర్ కూడా అసెంబ్లీలో ప్రభుత్వ పక్షం వహస్తున్నారు. సజావుగా సాగాల్సిన అసెంబ్లీ వ్యక్తిగత దూషణలకు వేదికైంది. మీరు మారకపోతే మెడలు వంచి మారుస్తాం” అని పేర్కొన్నాడు.
Balakrishna Warning to YCP Leaders