Sunday, November 3, 2024

శాస్త్రీయ సంగీతం ప్రతిష్ఠ పెంచిన ‘బాలమురళి కృష్ణ’ : కోలేటి దామోదర్

- Advertisement -
- Advertisement -

కాచిగూడ: శాస్త్రీయ సంగీతం అంటే ఏకొద్ది మంది సంప్రదాయ వాదులకు మాత్రమే పరిమితం అని భావించే కాలంలో సా మాన్య ప్రజలను సైతం ఆస్వాదించే రీతిలో ప్రదర్శనలు ఇచ్చి ఆ సంగీతం ప్రతిష్టను బాలమురళి కృష్ణ పెంచారని తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. త్యాగరాయగాన సభలోని కళా సుబ్బారావు కళావే దికపై గా నసభ నిర్వహణలో జరుగుతున్న శతాబ్ది పూర్వ మహనీయులు యాదిలో భాగంగా విఖ్యాత కర్ణాటక సంగీత కళాకా రుడు, పద్మ విభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాల మురళి కృష్ణ జయంతి సమావేశ ంలో నిర్వహించారు.

ముఖ్యఅతిథిగా దామోదర్ పాల్గొని ఆరవ ఏటనే మహాపండితులు ముందు గానం చేసి వారిచే మెప్పు పొందిన బాలమురళి జీవితాంతం సంగీతమే శ్వాసగా గడిపారని వివరించారు. అధ్యక్షత వహించిన గానసభ అధ్యక్షుడు కళా జనార్ధనమూర్తి మాట్లాడుతూ తమ తండ్రి కళా సుబ్బారావు గానసభ అధ్యక్షునిగా ఉన్న కాలం నుంచి మురళికి గానసభ పట్ల ప్రత్యేక అభిమానం ఉందని తమ సోదరుడు దీక్షితులు అధ్యక్షుడుగా ఉన్న సమయంలో వారం రోజులు ఉచితంగా గానస భ ప్రాంగణంలో సంగీతార్ధులకు శిక్షణనిచ్చిన ఉన్న త మానవతా మూర్తి బాల మురళి అని కొనియాడారు. సాహితీవేత్త రమణ వెలమకన్ని కీలకప్రసంగంలో బాలమురళి విశిష్టతను తెలిపారు. సభలో చిక్కా రామదాసు, గాయని శ్రీమణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News