Wednesday, January 22, 2025

బాలానగర్ లో దారుణం.. రూ.400 కోసం హత్య..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని బాలానగర్ లో దారుణం జరిగింది. రూ.400 కోసం ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం ఉదయం నర్సాపూర్ చౌరస్తాలో కూలీలుగా పనిచేసే కాశీరాం, శ్రీనివాస్ లు రూ.400 కోసం గొడవ పడ్డారు. ఇద్దరి మధ్య మాట మాట పెరిగడంతో ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. ఈ క్రమంలో రెచ్చిపోయిన కాశీరాం, శ్రీనివాస్ ను కర్రతో కొట్టి పక్కనుంచి వెళ్తున్న లారీ క్రిందకు తోసేశాడు.

దీంతో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దావఖానాకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News