Wednesday, January 8, 2025

బాలాపూర్ గణేష్ శోభాయాత్రకు ప్రత్యేక ఏర్పాట్లు..

- Advertisement -
- Advertisement -

బాలాపూర్ గణేష్ శోభాయాత్రకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.  రేపు(గురువారం) బాలాపూర్ గణేష్ శోభాయాత్ర.. బాలాపూర్ నుంచి పాతబస్తీలోని చంద్రయాన్ గుట్ట, చార్మినార్, అఫ్జల్ గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్ మీదుగా హుస్సేన్ సాగర్ వరకు 19 కి.మీ. మేర సాగనుంది.

దీంతో ట్రాఫిక్ నియంత్రణ కోసం అధికారులు భారీ ఏర్పాటు చేస్తున్నారు. ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గణేష్‌ నిజమజ్జనం సందర్భంగా 3,600 సిసి కెమెరాలను ఇప్పటికే అనుసంధానించినట్లు అధికారులు తెలిపారు. గణేష్ శోభయాత్రను వివిధ శాఖాధికారులు సమన్వయంతో పర్యవేక్షించేలా కమాండ్ కంట్రోల్ లో ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News