Saturday, November 23, 2024

రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ.. ఎంతో తెలుసా?

- Advertisement -
- Advertisement -

 

Balapur laddu 2022 price

హైదరాబాద్: భాగ్యనగర్ గణేష్ ఉత్సవాల్లో బాలాపూర్ లడ్డూకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రతి యేటా ఈ లడ్డూను సొంతం చేసుకునేందుకు ఎందరో పోటీపడుతుంటారు. ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ వేలంలో రూ.24 లక్షల 60 వేల రూపాయలు ధర పలికింది. శుక్రవారం గణేష్ నిమజ్జనం సందర్భంగా నిర్వహించి వేలంలో ఈ లడ్డూను వంగేటి లక్ష్మారెడ్డి దక్కించుకున్నాడు. ఈ లడ్డు వేలం పాటకు పెద్ద సంఖ్యలో భక్తులు, నాయకులు పాల్గొన్నారు. గత సంవత్సరం బాలాపూర్ గణేష్ లడ్డూను మర్రి శశాంక్ రెడ్డి, ఎపి ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ వేలం పాటలో 18 లక్షల 90 వేలకు దక్కించుకున్న విషయం తెలిసిందే.

1994 కోలన్ మోహన్‌రెడ్డి రూ. 450.
1995 కోలన్‌మోహన్‌రెడ్డి రూ. 4,500.
1996 కోలన్ కృష్ణారెడ్డి రూ. 18 వేలు.
1997 కోలన్ కృష్ణారెడ్డి రూ. 28 వేలు
1998 కోలన్‌మోహన్‌రెడ్డి రూ.51 వేలు
1999 కల్లెం ప్రతాప్‌రెడ్డి. రూ.65 వేలు
2000 కల్లెం అంజిరెడ్డి రూ.66 వేలు
2001 జి. రఘునందన్‌రెడ్డి రూ.85 వేలు
2002 కందాడ మాధవ్‌రెడ్డి రూ. లక్షా ఐదువేలు
2003 చిగిరింత బాల్‌రెడ్డి రూ.1.55 లక్షలు
2004 కొలన్ మోహన్‌రెడ్డి రూ. 2 లక్షల ఒక వేయి
2005 ఇబ్రహీం శేఖర్ రూ.. 2 లక్షల ఎనిమిది వేలు
2006 చిగురింత తిరుపతిరెడ్డి రూ. 3 లక్షలు
2007 జి. రఘనందనాచారి రూ. 4 లక్షల 15 వేలు
2008 కోలన్ మోహన్‌రెడ్డి రూ. 5లక్షల, 7 వేలు
2009 సరిత రూ. 5లక్షల 10వేలు
2010 శ్రీధర్‌బాబు రూ. 5 లక్షల, 35వేలు.
2011 కోలన్ ఫ్యామిలీ రూ.. 5 లక్షల 45 వేలు.
2012 పన్నాల గోవర్థన్‌రెడ్డి రూ. 7 లక్షల 50 వేలు.
2013 తీగల కృష్ణారెడ్డి రూ. 9 లక్షల 26 వేలు.
2014 సింగిరెడ్డి జయేందర్‌రెడ్డి రూ. 9 లక్షల 50 వేలు.
2015 కళ్లెం మదన్‌మోహన్ రూ. 10 లక్షల 32 వేలు.
2016 స్కైలాబా రెడ్డి రూ. 14 లక్షల 65 వేలు.
2017 నాగం తిరుపతిరెడ్డి రూ. 15లక్షల 60 వేలు.
2018 శ్రీనివాస్‌గుప్తా రూ.16 లక్షల 60 వేలు.
2019 కోలన్ రాంరెడ్డి రూ. 17 లక్షల 60 వేలు.
2020 కరోనా కారణంగా వేలం జరగలేదు.
2021 మర్రి శశాంక్‌రెడ్డి రూ.18 లక్షల 90 వేలు.

2022 వంగేటి లక్ష్మారెడ్డి రూ.24.6 లక్షలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News