Wednesday, November 20, 2024

జమ్మి చెట్టును నాటిన టిఆర్ఎస్ లీడర్ బాలరాజు యాదవ్

- Advertisement -
- Advertisement -

Balaraju yadav plant tree

హైదరాబాద్: గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో భాగంగా  ఎల్ .బి.నగర్ నాగోల్ రాక్ టౌన్ ప్రభుత్వ పాఠశాలలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా.దూదిమెట్ల రాజేశ్వరి బాలరాజు యాదవ్ జమ్మి చెట్టు నాటారు.  తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి సిఎం కెసిఆర్ హరితహారం స్ఫూర్తితో రాజ్యసభ్యులు గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమ రూపకర్త జోగినపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన స్పూర్తితో మా వివాహవార్షకోత్సవం సందర్బంగా రాక్ టౌన్ ప్రభుత్వ పాఠశాలలో అధ్యాపకుల, పాఠశాల విద్యార్థుల సమక్షంలో 2 జమ్మి మెుక్కలను నాటటం జరిగింది. ఈ సందర్బంగా డా.దూదిమెట్ల రాజేశ్వరి బాలరాజు యాదవ్ మాట్లాడారు. తెలంగాణ ట్రీ జమ్మి చెట్టు విజయానికి సూచిక అని, సిఎం కెసిఆర్ స్ఫూర్తితో ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంబించారు. ఉస్మానియా యూనివర్సిటీ లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొనటం, బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్యం కావటం మా అదృష్టం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు చందన, నారయణ, సునిల్, శీనివాస్, నోముల బిక్షు యాదవ్, శరత్, రవి, శ్రవన్, బాలు, రమేష్, సురేష్, అశోక్, మనోహర్, వెంకన్న, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News