- Advertisement -
కటక్ : బాలేశ్వర్ సమీపం లోని బహానగా బజార్ వద్ద రైళ్ల ప్రమాదంలో 238 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 900 మంది గాయపడ్డారు. వీరిని ప్రభుత్వ ఆస్పత్రి లోను, సమీప ఆస్పత్రుల్లోనూ చికిత్స చేస్తున్నారు. అయితే వీరికి రక్తం అవసరం అవుతుందని వందలాది మంది యువకులు శుక్రవారం రాత్రి బాలేశ్వర్ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. వీరంతా గంటల తరబడి వేచి ఉండి గాయపడిన వారికి రక్తదానం ఇస్తుండడం వారిలోని మానవత్వాన్ని చాటింది. అలాగే ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు చొరవ చూపించి ఎందరినో రక్షించగలిగారు. దాదాపు 200 నుంచి 300 మందిని కాపాడగలిగాం అని స్థానికుడు ఒకరు మీడియాకు చెప్పారు.
- Advertisement -