Monday, December 23, 2024

సంక్రాంతి బరిలో మాస్ యాక్షన్ మూవీ?

- Advertisement -
- Advertisement -

Balayya 107 Movie to release on Sankranti 2023

సీనియర్ స్టార్ నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్‌గా దర్శకుడు గోపీచంద్ మలినేని ఓ మాస్ యాక్షన్ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. బాలయ్య కెరీర్‌లో 107వ సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై మాసివ్ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం షూటింగ్ పలు ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. మేకర్స్ ఈ చిత్రాన్ని ముందుగా డిసెంబర్ 2న విడుదల చేయాలని నిర్ణయించారని తెలిసింది. అయితే ఇప్పుడు మళ్ళీ సినీ వర్గాల నుంచి మరో కొత్త వార్త వినిపించింది. మేకర్స్ ఈ సినిమాని సంక్రాంతి బరిలో దించేందుకు ప్లాన్ చేస్తున్నారట. మరి దీనిలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇప్పటికే సంక్రాంతి రేస్‌లో మెగాస్టార్ 154వ సినిమా విడుదలను ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ఈ పోటీపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

Balayya 107 Movie to release on Sankranti 2023

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News