Monday, December 23, 2024

బాలయ్య ఉగ్ర రూపం

- Advertisement -
- Advertisement -

’అఖండ’తో ఇండస్ట్రీ హిట్‌ని అందుకున్న నటసింహ నందమూరి బాలకృష్ణ, ‘క్రాక్’ సినిమాతో మాస్ విజయాన్ని అందుకున్న స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఇంతకంటే బిగ్గెస్ట్ హిట్ అందించడానికి కలసి పని చేస్తున్నారు. ‘ఎన్‌బికె 107’ అనే వర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. శనివారం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 100వ జయంతిని పురస్కరించుకుని ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ చిత్రం నుండి సరికొత్త మాస్ పోస్టర్‌ను విడుదల చేశారు నిర్మాతలు. టెంపుల్ బ్యాక్‌డ్రాప్‌లో చేతిలో రక్తం చిందిన కత్తి పట్టుకొని, పిడికిలి బిగిస్తూ బాలయ్య ఉగ్రరూపంలో కనిపిస్తున్న ఈ పోస్టర్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఇక ఇంతకు ముందెన్నడూ చూడని మాస్ లుక్, డిఫరెంట్ పాత్రలో బాలకృష్ణని చూపించబోతున్నారు గోపిచంద్. సినిమా టైటిల్‌ను త్వరలో ప్రకటిస్తారు. ఇప్పటికే 40 శాతం చిత్రీకరణ పూర్తయింది. నిర్మాతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

Balayya Poster Release from NBK 107

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News