Friday, December 20, 2024

‘వెంకీ-అనిల్ 3’ సెట్స్‌లో బాలయ్య సందడి

- Advertisement -
- Advertisement -

విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ల సెన్సేషనల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ఎంటర్‌టైనర్ ‘వెంకీ-అనిల్3’. పొల్లాచ్చిలో కీలకమైన షెడ్యూల్ పూర్తయిన తర్వాత, ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలో ఈ సినిమా న్యూ షూటింగ్ షెడ్యూల్ జరుగుతోంది. వెంకటేష్‌తో పాటు ప్రముఖ నటీనటులు షూటింగ్‌లో పాల్గొంటున్నారు. తాజాగా ఈ సెట్స్‌లోకి ప్రత్యేక అతిథి వచ్చారు. నటసింహం నందమూరి బాలకృష్ణ ‘వెంకీఅనిల్3’ సెట్స్‌లో సందడి చేశారు.

ఈ ఆన్-లొకేషన్ స్టిల్స్‌లో బాలకృష్ణ, వెంకటేష్, అనిల్ రావిపూడి మధ్య సోదరభావం చూడటం డిలైట్‌ఫుల్‌గా వుంది. బాలయ్య రాకతో టీం చాలా థ్రిల్ అయ్యింది. బాలకృష్ణ, వెంకటేష్ మంచి స్నేహితులు. అనిల్ రావిపూడి ఎన్‌బికె ఆల్-టైమ్ హిట్ భగవంత్ కేసరిని రూపొందించారు. ఇక ఈ చిత్రంలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, మీనాక్షి చౌదరి ఎక్స్ లవర్‌గా కనిపించనుంది. ఈ ట్రయాంగిల్ క్రైమ్ డ్రామాని దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ‘వెంకీ-అనిల్3’ని 2025 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News