Tuesday, November 5, 2024

ఐలాండ్‌ల అభివృద్ధిపై బల్దియా ప్రత్యేక నజర్

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: కరీంనగర్ పట్టణాన్ని ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. సోమవారం కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో జంక్షన్ల అభివృద్ధిపై, నగర మేయర్ వై సునీల్‌రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసిన జంక్షన్ ట్రయల్ రన్ పనులను నగర మేయర్ వై సునీల్‌రావుతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించే విధంగా ఆధునిక డిజైన్లతో 13 కొత్త ఐలాండ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

దానిలో భాగంగా నేటి నుండి కోతిరాంపూర్ జంక్షన్, పద్మనగర్ జంక్షన్, సిక్‌వాడీ జంక్షన్‌లతో పాటు శాతవాహన యూనివర్సిటీ జంక్షన్, ఓల్డ్ శిశు మందిర్ జంక్షన్, కేసీఆర్ సర్కూట్ హౌస్, కేసీఆర్ రెస్ట్ హౌస్‌లో ఫౌంటెన్, పీవీ నరసింహారావు స్టాచ్, మారుతినగర్ చౌరస్తా, నాకా చౌరస్తా, రేకుర్తి అంబేద్కర్ జంక్షన్, సర్వోదయ స్కూల్ అపోజిట్ జంక్షన్, నెహ్రు చౌక్‌ల పనులను మరి కొద్ది రోజుల్లో నిర్మాణ పనులను ప్రారంభించి ఆధునికరిస్తామని వెల్లడించారు. తెలంగాణలో ఇంత గొప్ప ఐలాండ్‌లు ఎక్కడ లేవన్నారు. ట్రాఫిక్ వ్యవస్థను మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, కరీంనగర్ వాసుల జీవన ప్రమాణాలు పెంచడమే ధ్యేయంగా కృషి చేస్తున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News