Thursday, January 23, 2025

114జంక్షన్‌ల అభివృద్దికి బల్దియా ప్రణాళికలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో: నగరంలోని 114 మేజర్ జంక్షన్ అభివృద్ధికి జిహెచ్ ఎంసి ప్రణాళికలను సిద్దం చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో నగరం అంతాకంత విస్తరిస్తుండడంతో అదే స్థాయిలో వాహనాల సంఖ్య కూడా పెరుగుతోంది. అంతేకాకుండా పర్యాటక రంగంలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన హైదరాబాద్ కు , విదేశాల నుండి పర్యాటకులు వస్తుండడంతో ట్రాఫిక్ రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో రవాణా నెట్ వర్క్ లో అంతర్భాగంగా ఉంటున్న జంక్షన్‌లను అభివృద్ది చేయడం ద్వారా పెరుగుతున్న వాహన రద్దీ తట్టుకునే విధంగా తీర్చిదిద్దేందుకు జిహెచ్‌ఎంసి కృషి చేస్తోంది. హైదరాబాద్ నగరం విశ్వ నగరంగా గుర్తింపు పొందడంతో వివిధ రంగాలను అభివృద్ది తో ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థ అందుబాటులోకి తేవడం, మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తూ అవసరమైన సైక్లింగ్ , జంక్షన్ ల అభివృద్ది మరింత మెరుగు సుందరీకరణ చేసి రవాణా వ్యవస్థ కు జంక్షన్ లఅభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇంతకు ముందున్న జంక్షన్ లలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సిగ్నల్ వ్యవస్థ తో పాటు పాదచారుల భద్రతకుప్రాధాన్యతనిస్తూ జంక్షన్ అభివృద్ధి చేయడంతో పాటుగా మరింత మెరుగు పరిచేందుకు నగరంలో ప్రయోగాత్మకంగా 12 కూడళ్లను వినూత్నంగా అభివృద్ధికి చర్యలు చేపట్టిన జిహెచ్‌ఎంసి మరో 114 మేజర్ జంక్షన్ లను గుర్తించి అభివృద్ధికి ,సుందరీకరణ ప్రజలకు ఆకర్షణీయంగా చేపట్టేందుకు నిర్ణయించారు.

30 Junction Constructed with New Method in Traffic Management

నగరంలో 60 జంక్షన్ల అభివృద్దికి ప్రతిపాదనలు:

114మేజర్ జంక్షన్ల అభివృద్దిలో భాగంగా ముందుగా నగరంలో 60 జంక్షన్ లను యుద్ద ప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించారు.ఇందులో భాగంగా 60 జంక్షన్‌ల్లో కొన్ని మూడు మార్గాలు, మరికొన్ని చోట్ల 4 మార్గాలు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొదటి దశ కింద ఎల్ బినగర్ జోన్ లో 10, చార్మినార్ జోన్ లో 10, ఖైరతాబాద్ జోన్ లో 11, శేరిలింగంపల్లి జోన్ లో 9, కూకట్ పల్లి జోనల్ 9, సికింద్రాబాద్ జోన్ 11 మొత్తం 60జంక్షన్ల అభివృద్ధితో పాటు సుందరీకరణ పనులు చేపట్టనున్నారు.

మరో 54జంక్షన్ల సుందరీకరణకు కృషి…

జిహెచ్‌ఎంసి పరిధిలో రూ.33 కోట్ల అంచనా వ్యయంతో ప్రయోగాత్మకంగా 12 జంక్షన్ లకు అభివృద్ధికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. పాదచారుల ప్రయోజనం ట్రాఫిక్ రద్దీ నీ నియంత్రించేందుకు గార్డెనింగ్ ఏర్పాట్లు చేసేందుకు నిర్ణయించారు. నగరంలో జంక్షన్ లను మరింత అభివృద్ధి, సుందరీకరణ మెరుగుపరిచి నగరవాసులకు ఆకట్టుకునే , ఆకర్షణీయంగా కనబడేలా 54 జంక్షన్లను చేపట్టేందుకు చర్యలు చేపట్టారు.ఈ జంక్షన్లలో పాదచారుల సౌకర్యాలు, కూర్చోవడానికి కుర్చీల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఎల్బీనగర్ జోన్ లో 6, చార్మినార్ జోన్ లో 3, ఖైరతాబాద్ జోన్ లో 24, శేరిలింగంపల్లి జోన్ లో 6, కూకట్ పల్లి జోన్ లో 6, సికింద్రాబాద్ జోన్ లో 9 జంక్షన్లను సుందరీకరణ తో అభివృద్ధి చేయనున్నారు.

మంత్రి కెటిఆర్ దిశ నిర్ధేశంలో నగర అభివృద్ది: మేయర్ విజయలక్ష్మి

మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు దిశ నిర్ధేశనంలో హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకొంటోందని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ఇందులో భాగంఆ నగరం లో గల 350 పైగా జంక్షన్‌లు ఉండగా అందులో మేజర్ గల జంక్షన్ లను అభివృద్ది చేసి రవాణా వ్యవస్థను పటిష్టం చేయడానికి పాదచారుల ప్రయోజనం తో పాటుగా మరింత సౌందర్యంగా ,ఆకర్షణీయంగా కనబడేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రజల అవసరాల ను గుర్తించి అందుకు తగ్గట్లుగా అభివృద్ధికిమంత్రి కెటిఆర్ కృషి చేస్తున్నారని మేయర్ విజయ లక్ష్మి ,డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డిలు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News