నల్గొండ: ఎస్‌ఆర్‌ఎస్‌పి స్టేజ్ టూ పూర్తి చేసి మూడున్నర లక్షల ఎకరాలకు పైగా సాగు నీరు అందించామని టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ బాల్కసుమన్ తెలిపారు. నాగార్జున ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సుమన్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి మండలానికో సామంత రాజునుపెట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనతో తండాలను పంచాయతీలుగా ఎందుకు మార్చలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఔట్ డేటెడ్ పార్టీ అని, కాంగ్రెస్ గతం, జానారెడ్డి గతం అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తు టిఆర్‌ఎస్సే అని తెలిపారు. బిజెపి దేశాన్ని అమ్మేస్తోందని, ప్రధాని నరేంద్ర మోడీకి గడ్డం పెరిగినట్లుగా దేశంలో నిత్యవసర వస్తువులు ధరలు పెరుగుతున్నాయని మండిపడ్డారు. బిజెపికి ఓటేస్తే నాగార్జున సాగర్ నీటిని మనకే అమ్ముతారని చురకలంటించారు. కర్నాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ఎన్ని సార్లు అడిగినా ఎందుకు ఇవ్వడం లేదని బిజెపిని ప్రశ్నించారు.
జానాకు సామంతరాజులు ఉన్నారు: సుమన్
- Advertisement -
- Advertisement -
- Advertisement -