హైదరాబాద్: చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ప్రభుత్వ విప్ బాల్కససుమన్ తెలిపారు. టిఆర్ఎస్ భవనం నుంచి బాల్కసుమన్ మీడియాతో మాట్లాడారు. నాయకుల కటుంబ సభ్యులను, పిల్లలను, మహిళలను కించపరచడం సరికాదన్నారు. నవీన్ వ్యాఖ్యల వెనుక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నారని, చింతపండు నవీన్‌కు చెంప దెబ్బలు కాదని, చెప్పు దెబ్బలు తగులుతాయని హెచ్చరించారు.
తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను యావత్ తెలంగాణ ఖండించాలన్నారు. బిజెపి విష సంస్కృతిలో భాగమే నవీన్ వ్యాఖ్యలు అని అన్నారు. బిజెపి నేతలకు దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని సవాలు విసిరారు. ప్రభుత్వ పక్షాన ఎవరు నిలబడితే వారిపై నకిలీ విడియోలు సృష్టిస్తున్నారని, ఇలాంటి వారిపై స్థానకంగా ఉన్న టిఆర్‌ఎస్ నేతలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని బాల్కసుమన్ సూచించారు. మా ఓపికకు, సహనానికి హద్దు ఉంటుందని, కేంద్ర ప్రభుత్వంలో 8 లక్షల 72 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఎందుకు భర్తీ చేయడం లేదని బండి సంజయ్‌ను ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా 35 పిఎస్‌యులను కేంద్రం అమ్మకానికి పెట్టిందని, ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిలకు కేంద్రం అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.