Thursday, December 26, 2024

మంచిర్యాల జిల్లా.. బిఆర్‌ఎస్ ఖిల్లా

- Advertisement -
- Advertisement -

(సంతోష్ కుమార్/మంచిర్యాల ప్రతినిధి)
ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యేలుగా తాము చేసిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయమని మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాలలో గల బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్ధులు ధీమాతో ఉన్నారు. జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్ల్లి అసెంబ్లీ నియోజకవర్గాలను అభివృద్ధి చేసిన తమకే మరోసారి ఎమ్మెల్యేలుగా అవకాశం ఇవ్వాలని ప్రజలను వారు కోరుతున్నారు.

మంచిర్యాలలో దివాకర్‌రావు విజయావకాశాలు
నియోజకవర్గంలో మెడికల్ కాలేజి నిర్మాణం, బసంత్‌నగర్ అంతర్గాం బ్రిడ్జి, సమీకృత కలెక్టర్ కార్యాలయ నిర్మాణం, మూడు మున్సిపాలిటీల్లో సమీకృత మార్కెట్లు, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, ఆది పరిశ్రమల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధ్ది శిక్షణ కార్యాలయం, వ్యవసాయ మార్కెట్ కమిటి అభివృద్ధి పనులు, గ్రామీణ ఉపాది హామీ అభివృద్ధి, నీటిపారుదల అభివృద్ధి, మాతా శిశు వంటి అభివృద్ధి పనులను పూర్తిచేసిన బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే దివాకర్‌రావు వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా తననే గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతానని ప్రజలకు హామీ ఇస్తున్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో మొత్తం 2,64,186 ఓటర్లు ఉండగా అందులో పురుషులు 1,31,871, స్త్రీలు 1,32,292, థర్డ్ జెండర్ 23 మంది ఉన్నారు.

బెల్లంపల్లి ఎంఎల్‌ఎ చిన్నయ్య విజయావకాశాలు
గత పది సంవత్సరాల్లో బెల్లంపల్లి నియోజవకర్గంలో గోదాముల నిర్మాణం, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయాల నిర్మా ణం, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధ్దరణ, వైకుంటదామాలు, నూతన రహదారుల ఏర్పాటు, బీటీ రోడ్ల మరమ్మత్తులు, సీసీ రోడ్లు, కాలువలు, గ్రామ పంచాయతీ భవనాలు, సామాజిక సంఘ భవనాలు, అంగన్వాడీ భవనాలు, ఆదర్శ పాఠశాల భవన నిర్మాణం, ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికల వసతి గృహం, వంద పడకల ఏరియా ఆసుపత్రి, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల కాంప్లెక్స్ స్టాఫ్ క్వార్టర్స్, మొదలైన పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 1,69,598 ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 84,790, స్త్రీలు 84,796, థర్డ్ జెండర్స్ 12 మంది ఉన్నారు.

చెన్నూరులో బాల్క సుమన్ దూకుడు
ఎమ్మెల్యే బాల్క సుమన్ హయాంలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ, ఎత్తిపోతల పథకం, పోడు భూముల పట్టాలు, సింగరేణి ఇండ్ల పట్టాలు, వంద పడకల ఆసుపత్రి, బస్ డిపో, సమ్మక్క సారల మ్మ మహిళా భవన్‌ల నిర్మాణం, లైబ్రరీలు, సెంట్రల్ లైటింగ్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, వైకుంఠదామాల నిర్మాణం, 33 కేవీ సబ్ స్టేషన్ పనులు, డంపింగ్ యార్డులు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, ఆర్‌వోబీ పనులు, ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, ఐటీఐ కళాశాల భవన నిర్మాణం, రైల్వే ఓవర్ బ్రిడ్జి, డబుల్ బెడ్‌రూం ఇండ్లు, ఇలా పలు అభివృద్ధి పనులు చేపట్టారు. చెన్నూరు నియోజకవర్గంలో మొత్తం 1,84,117 మంది ఓట ర్లు ఉండగా ఇందులో 91,969 మంది పురుషులు, 92,141 మంది స్త్రీలు ఉన్నారు. 7 మంది థర్డ్ జెండర్స్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News