Wednesday, January 22, 2025

కారు గుర్తుకే ఓటేస్తాం..ఇంటి ముందు ఫ్లెక్సీ

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల: మంచిర్యాల జిల్లా చెన్నూరు బిఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ పై అభిమానంతో.. క్యాతనపల్లి మున్సిపాలిటీ, గద్దెరాగడికి చెందిన జింక రమేష్ కారు గుర్తుకే ఓటేస్తామని వారి ఇంటి ముందు ఫ్లెక్సీ వేసుకున్నారు. చెన్నూర్ నియోజకవర్గాన్ని గత 60 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చేసిన బాల్క సుమన్ కే తమ కుటుంబం మొత్తం ఓటేస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎవరూ తమ ఇంటికి ఓట్ల కోసం రావద్దన్నారు.

చెన్నూర్ నియోజకవర్గం, కోటపల్లి మండలంలోని అన్నారం గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన కోట కిష్టయ్య కుమార్తె రవీనకు వైద్య విద్య కోసం కొద్ది రోజుల క్రితం చెన్నూర్ బిఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేసి గొప్ప మనసు చాటుకున్నారు. అందుకు కృతజ్ఞతగా రానున్న ఎన్నికల్లో బాల్క సుమన్ కి ఓటేస్తామని కుటుంబ సభ్యులు ఇంటి ముందు ఫ్లెక్సీ పెట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News