Sunday, January 19, 2025

రైతులను ఇబ్బంది పెట్టడమే బిజెపి ఏకైక లక్ష్యమా? : బాల్కసుమన్

- Advertisement -
- Advertisement -

balka suman fires on central government

హైదరాబాద్: తెలంగాణ రైతులను ఇబ్బంది పెట్టడమే బిజెపి ఏకైక లక్ష్యంగా అన్నట్లుగా ఉందని టిఆర్ఎస్ ఎంఎల్ఎ బాల్కసుమన్ అన్నారు. ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఆకలి సూచీలో భారత్ దారుణంగా 101 ర్యాంకులో ఉందని గుర్తుచేశారు. ఆకలి సూచీలో బంగ్లాదేశ్, నేపాల్ కూడా మనకంటే మెరుగ్గా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర బిజెపి నేతలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి మొత్తం ధాన్యం కొనేలా చేయాలని సూచించారు. రాష్ట్రంలో మొత్తం ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోతే ఉదృత పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఆహార భద్రతను కేంద్రం కనీస బాధ్యతగా భావించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News