Friday, November 15, 2024

రాజ్‌భవన్ కాదు.. రాజకీయ భవన్: గవర్నర్ పై బాల్క సుమన్ ఫైర్

- Advertisement -
- Advertisement -

Balka Suman Fires on Governor Tamilisai

రాజ్‌భవన్ కాదు.. రాజకీయ భవన్
గవర్నర్ తమిళసై పై నిప్పులు చెరిగిని విప్ బాల్క సుమన్
రాజకీయాల్లో ఈటెల శిఖండి: టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాజ్‌భవన్ కాదు.. రాజకీయ భవన్ అంటూ గవర్నర్ తమిళసై పై టిఆర్‌ఎస్ విప్ బాల్క సుమన్ నిప్పులు చెరిగారు. టిఆర్‌ఎస్ విప్ గువ్వల బాలరాజు, కెపి వివేకానంద,ముఠా గోపాల్, నోముల భగత్, సురేందర్, ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు, దండె విఠల్‌తో కలిసి బాల్క సుమన్ టిఆర్‌ఎస్ ఎల్పీలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. గవర్నర్‌గా తమిళసై తన పరిధులు అతిక్రమించి ఢిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రిపై రాజకీయ విమర్శలు గుప్పించడం దారుణమని ఆయన పేర్కొన్నారు. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ బిజెపి కండువా కప్పుకుని రాజకీయాలు మాట్లాడితే మంచిదని బాల్క సుమన్ సూచించారు. కెసిఆర్ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడటానికి గవర్నర్ ఎవరు? అని నిలదీశారు. గవర్నర్ రాజకీయం చేస్తున్న తీరును మీడియా కూడా ఖండించాలన్నారు. గతంలో గవర్నర్లు హుందాగా ప్రవర్తించేవారు. క్లౌడ్ బరస్ట్ గురించి మాట్లాడటానికి గవర్నర్ ఏమైనా శాస్త్రవేత్తనా అని సుమన్ ప్రశ్నించారు.
ఈటెల విశ్వాస ఘాతకుడు, తిన్నింటి వాసాలను లెక్కబెట్టారు..
బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విశ్వాస ఘాతకుడు, తిన్నింటి వాసాలను లెక్క బెట్టారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ధ్వజమెత్తారు. 2004కు ముందు ఈటెల అడ్రస్ ఎక్కడ..? ఈటెలను మంత్రి చేసింది కెసిఆర్ కదా? అని సుమన్ ప్రశ్నించారు. ఈటెల రాజేందర్ మాటలను చూసి జనం నవ్వుకుంటున్నారని..ఈటెల శిఖండి రాజకీయాలు చేస్తున్నారని సుమన్ మండిపడ్డారు. పదవులు, రాజకీయాలు తప్ప బిజెపి, కాంగ్రెస్‌లకు ఈ వరదల్లో ప్రజల ఘోష పట్టడం లేదన్నారు. ఈటెల లాంటి వారు పేకాటలో జోకర్లుగా మారారు. బిసి, ఎస్‌సిల భూములు కబ్జా చేసిన నీచ చరిత్ర ఈటెలదని మండిపడ్డారు. ఈటెల చిట్టాను బయటకు తెచ్చి కబ్జా చేసిన భూములను పేదలకు పంచుతామని అన్నారు. బిజెపి అవినీతిపరులు క్రిమినల్స్‌కు అడ్డాగా మారిందన్నారు.

ఈటెల ఎగిరెగిరి మాట్లాడుతున్నారు… నోరు జాగ్రత్త అని సుమన్ హెచ్చరించారు. మంత్రిగా ఉన్నపుడు కాళేశ్వరం ను అద్భుత ప్రాజెక్టు గా పేర్కొన్న ఈటెల ఇపుడు పార్టీ మారి తిడుతున్నారు. ఈటెల గోడ మీద పిల్లి. ఆర్థిక మంత్రిగా చేసి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు..20 మంది టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని ఈటెల అంటున్నారు.. కనీసం వార్డు మెంబర్ కూడా ఆయనకు టచ్‌లో లేరు.. రాబోయే రోజుల్లో బిజెపి నుంచే టిఆర్‌ఎస్‌లో చేరికలుంటాయి. బిజెపి భావజాలాన్ని ప్రజలు బొంద పెట్టే రోజులు ఎంతో దూరంలో లేవు. అన్నం పెట్టిన చేతికి సున్నం పెట్టె రకం ఈటెల. హుజురాబాద్ లో ఈటెల ను గెలిపించినందుకు ప్రజలు బాధ పడుతున్నారు. ఈటెల దమ్ముంటే మళ్లీ హుజురాబాద్ లోనే పోటీ చేసి గెలవాలి. ఓడిపోతాననే తెలిసి ఈటెల కొత్త పల్లవి అందుకున్నారు..అందుకే గజ్వేల్‌లో కెసిఆర్‌పై పోటీ చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. ఈటెల కెసిఆర్‌పై పోటీ చేసే సిఫాయా…ఈటెల ఓ చెల్లని రూపాయి అని విమర్శించారు. పబ్లిసిటీ కోసమే ఈటెల ఈ తంటాలు పడుతున్నారని పేర్కొన్నారు. బిజెపిలో ఈటెలది బానిస బతుకు అని తెలిపారు. వరదల్లోనూ బిజెపి కండువాలు కప్పుతూ బురద రాజకీయం చేస్తోందని ఆయన విమర్శించారు. ఈటెల వంటి శిఖండిలు తెలంగాణ కంట్లో నలుసులా మారారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ బిజెపిలు తెలంగాణ ద్రోహుల తయారీ కర్మాగారాలుగా మారాయని విమర్శించారు.
ఈటెలది వ్యాపార నైజం
బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ది వ్యాపార నైజం.. ఆయనకు ఏ సిద్ధాంతం లేదని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు విమర్శించారు. కమ్యూనిస్ట్ కమ్యునలిస్టుగా మారారని విమర్శించారు. గజ దొంగల పార్టీలో చేరిన ఈటెల నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాజేందర్‌కు దమ్ముంటే.. ఆయనతో టచ్‌లో ఉన్నవారి పేర్లను బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బిజెపి తెలంగాణలో ఎదగడానికి అవకాశం లేదన్నారు. తెలంగాణలో బిజెపి సింగిల్ డిజిట్ కూడా దాటదని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని పడగొట్టడం మోదీ జేజమ్మ తరం కూడా కాదన్నారు.

Balka Suman Fires on Governor Tamilisai

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News