Wednesday, January 22, 2025

సిఎం కెసిఆర్‌కి కృతజ్ఞతలు: బాల్కసుమన్

- Advertisement -
- Advertisement -

Balka Suman Press Meet at TRSLP office

 

హైదరాబాద్: సింగరేణి కార్మికుల పక్షాన ముఖ్యమంత్రి కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. టిఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్ లో బాల్కాసుమన్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ దండే విఠల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ… సింగరేణి కార్మికులకు లాభాల్లో 30 శాతం వాటా ఇవ్వాలని సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. 2014కు ముందు సింగరేణి లాభాల్లో 18 శాతం ఉన్న కార్మికుల వాటా ఇప్పుడు 30 శాతం పెరిగిందన్నారు. దేశంలో ఏ సంస్థ ఈ స్థాయిలో వాటా ఇవ్వదని ఆయన పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ దూరదృష్టితోనే సింగరేణి 32వేల కోట్లకు పైగా టర్నోవర్ సాధించిందన్నారు. ఇతర రాష్ట్రాలకు సంస్థ విస్తరిస్తోందని తెలిపారు. కార్మికుల సంక్షేమంలో అత్యున్నత స్థానంలో ఉందని చెప్పిన బాల్క 9 వేల మంది కార్మికుల సర్వీసులనును క్రమబద్దీకరణ చేసిందన్నారు. కార్మికుల సొంత ఇంటి నిర్మాణానికి వడ్డీ లేని రుణం తెలంగాణ సర్కార్ ఇస్తోందని చెప్పారు. దేశంలో కేంద్ర ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో సింగరేణి దినదిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందుతోందని వెల్లడించారు. సిఎం కెసిఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు కేంద్రం ఆదర్శంగా తెలుకోవాలని సూచించారు. ఒక్కరిద్దరి కోసం ప్రభుత్వ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తోందని బాల్కసుమన్ ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News