హైదరాబాద్: ధాన్యం కొనుగోలు విషయంలో దున్నపోతు మీద వాన పడ్డట్లు ఉంది కేంద్రం తీరు ఉందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. మంగళవారం ఉదయం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. ”బిజెపి పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఒక వార్షిక ప్రణాళిక చేయండి అంటే ఆ ఊసే ఎత్తడం లేదు. ఇన్ని రోజులుగా నిరసన చేస్తుంటే కేంద్రం పట్టించుకోవడం లేదు. మొండి వైఖరి, దుర్మార్గమైన వైఖరితో కేంద్రం వ్యవహరిస్తుంది. ధర్మపురి అరవింద్ అసలు మనిషేనా.. బట్టలూడదీసి కొట్టాలి. పసుపు బోర్డు తెస్తా అన్న అరవింద్ తీసుకొచ్చాడా. టీఆర్ఎస్ చేసిన పనులు ఏమైనా అరవింద్ కు తెలుసా. రేవంత్ రెడ్డి ఏనాడు తెలంగాణ కోసం పనిచేయలేదు. దొంగలకు హైద్రాబాద్ అభివృద్ధి ప్రదాత కెటిఆర్ ను విమర్శించే హక్కు ఉందా. ఒక్కనాడు కూడా పార్లమెంట్ లో ప్రొటెస్ట్ చేయలేదు. ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు దావత్ లు చేసుకుంటూ కూర్చున్నారు. నోట్ల కట్టలు పట్టుకొని దొరికిన దొంగ రేవంత్. అతను కెటిఆర్ పైన విమర్శలు చేస్తున్నారు. వీళ్ళకి కెటిఆర్ పైన మాట్లాడే అర్హత లేదు. టిఎస్ పిఎస్సి సభ్యుడిగా అవకాశమిచ్చి విఠల్ ను గౌరవించాం. పదవి లేకపోతే టీఆర్ఎస్ ను తిట్టడమేనా. పదవి పోగానే టీఆర్ఎస్ ను విమర్శించడం కొందరికి ఫ్యాషన్ గా మారింది” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Balka Suman Slams BJP MP Dharmapuri Aravind