Monday, December 23, 2024

యుపి, ఎపిలో వ్యవసాయ మోటర్లకు మీటర్లు: బాల్కసుమన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో అన్నిరంగాలకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఎంఎల్ఎ బాల్కసుమన్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా శాసన సభలో బాల్కసుమన్ మాట్లాడారు. వ్యవసాయంతో పాటు బలహీన వర్గాలకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని, మోడీ ప్రభుత్వం కొద్ది మంది కోసం విద్యుత్ సంస్కరణలు తీసుకొస్తుందని, కేంద్రం కుట్రలు ప్రజలకు తెలియజేయాలని బాల్కసుమన్ పిలుపునిచ్చారు. సమైక్య రాష్ట్రంలో కరెంట్ ఎప్పుడో వస్తుందో… ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. సమైక్య రాష్ట్రంలో కరెంట్ లేక వ్యవసాయం, పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయాయన్నారు. యుపి, ఎపిలో మోడీ ప్రభుత్వం వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడుతున్నారని మండిపడ్డారు. తన కంఠంలో ప్రాణం ఉండగా వ్యవసాయ మీటర్లకు మీటర్లు పెట్టనని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అని ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News