Wednesday, January 22, 2025

పోలీసుల సేవలు చిరస్మరణీయం: బాల్క సుమన్

- Advertisement -
- Advertisement -

ఆసిఫాబాద్ :పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా చేతన ఫౌండేషన్, రోటరి క్లబ్ వారి సహాకారంతో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పోలీసు ఆధ్వర్యంలో జిల్లా హెడ్ క్వార్టర్స్ నందు బుధవారం కృత్రిమ కాళ్లు ఉచితంగా అమర్చారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ సురేష్‌కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రభుత్వ చీఫ్ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పోలీసుల సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. జిల్లాలో స్వచ్చంద సంస్థలు, పోలీసు ఆధ్వర్యంలో కృత్రిమ కాళ్లు, చేతులు అమర్చడం, ఉచిత కుట్టుమిషన్లు, దుప్పట్లు పంపిణి, ఇతర సేవ కార్యక్రమాలు నిర్వహించడం గోప్ప విషయమని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ సురేష్‌కుమార్ మాట్లాడుతూ ప్రమాదవశత్తు, లేదా మధుమేహ వ్యాధి వల్ల కాళ్లు కోల్పోయిన దివ్యాంగులకు జైపూర్ పరిజ్ఞానంతో తయారు చేయబడిన కృత్రిమ కాళ్లు ఇచ్చుటకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు.

ఈ ఎంపిక శిభిరంలో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుండి మొత్తం 108 మంది వికలాంగులు హాజరయ్యారు. ఇందులో 94 మందికి కాళ్లు, 12 మందికి చేతులు బిగించారు. వీరందరికి గత నెల 6 న కాళ్ల పరీక్షలు నిర్వహించి, వారి వారి కొలతల అధారంగా కృత్రిమ కాళ్లను తయారు చేశారు. ఎంతో మంది పేదల కోసం, ఈ గోప్ప కార్యక్రమం చేపడుతున్న చేతన ఫౌండేషన్ (చైర్మన్ వెనిగల్ల రవికుమార్), చైర్మన్ దోడ్డపనేని సీతారామయ్య, రోటరీ కల్బ్ సాంబశివరావు ఖమ్మం వారికి ఎస్పీ శాలువ కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జల్లా జడ్పిచైర్‌పర్సన్ కోవలక్ష్మి, ఎంఎల్ఏ ఆత్రం సక్కు, కాగజ్‌నగర్ ఎంఎల్ఏ కోనేరు కోనప్ప, జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ అచ్చేశ్వర్‌రావు, అదనపు ఎస్పీ ఎఅర్ భీంరావు, డిఎస్‌పిలు శ్రీనివాస్, కరుణాకర్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News