Wednesday, January 22, 2025

సిఎంకి లేఖ రాసిన బాల్క సుమన్.. లేఖలో ఏముందంటే..?

- Advertisement -
- Advertisement -

టెట్ పరీక్ష ఫీజు తగ్గించి నిరుపేద అభ్యర్థులపై భారం తగ్గించాలని బిఆర్ఎస్ నేత బాల్క సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శనివారం లేఖ రాశారు. గతంలో టెట్ పరీక్ష ఫీజు ఒక పేపర్ కి 200, రెండు పేపర్లకి 300 రూపాయలు ఉండేది. కానీ ఇప్పుడు ఒక పేపర్ కి రూ.1000 రెండు పేపర్లకి రూ. 2000 పెంచడం వల్ల నిరుపేద అభ్యర్థులపై భారం పడనున్నదని తెలిపారు. అలాగే పరీక్ష నిర్వహణ 11 జిల్లా కేంద్రాల్లోనే కాకుండా 33 జిల్లా కేంద్రాల్లో నిర్వహించాలని లేఖలో పేర్కొన్నారు బాల్కసుమన్.

Image

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News