Monday, December 23, 2024

మంత్రి అల్లోల‌కు బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ళ్యాణ మ‌హోత్స‌వ‌ ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

Balkampet Yellamma Kalyana Mahotsavam Invitation to Minister Allola

హైద‌రాబాద్: జూలై 5న‌ జరిగే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థాన నిర్వ‌హ‌కులు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిని గురువారం ఆహ్వానించారు. గ‌చ్చిబౌలిలోని మంత్రి నివాసంలో ఆయ‌న‌ను కలిసి ఆహ్వాన ప‌త్రిక‌ను అందించారు. మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డికి ఆహ్వానం ప‌లికిన వారిలో ట్రస్టుబోర్డు చైర్మ‌న్ సాయిబాబా, ఇత‌ర‌ సభ్యులు, ఆలయ ఈవో అన్న‌పూర్ణ‌, అర్చకులు, తదితరులున్నారు. జూలై 4న ఎదుర్కోళ్లు, 5న అమ్మవారి కళ్యాణం, 6న రథోత్సవం జరుగ‌నున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News