- Advertisement -
హైదరాబాద్: ఈ నెల 13న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ వేడుక ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం పది లక్షల రూపాయలు కేటాయించిందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా కల్యాణోత్సవం జరగాలన్నారు. అమ్మవారు ముందు అందరూ సమానమేనన్నారు.
- Advertisement -