- Advertisement -
దేవాదాయ శాఖ మంత్రికి ఆహ్వానపత్రిక అందజేసిన కమిటీ ప్రతినిధులు
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఈ నెల 5న జరిగే బల్కంపేట రేణుక ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవాలకు హాజరు కావాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కమిటీ ప్రతినిధులు ఆహ్వానించారు. గురువారం గచ్చిబౌలిలోని మంత్రి నివాసంలో ఆయనను కలిసి ఆహ్వాన పత్రికను ఎల్లమ్మ పోచమ్మ దేవస్థాన నిర్వాహకులు అందజేశారు. జూలై 4న ఎదుర్కోళ్లు, 5న అమ్మవారి కల్యాణం, 6న రథోత్సవం నిర్వహించనున్నారు. కార్యక్రమంలో ట్రస్టుబోర్డు చైర్మన్ సాయిబాబా, ఆలయ ఇఒ అన్నపూర్ణ, అర్చకులు, తదితరులు ఉన్నారు.
- Advertisement -