Monday, December 23, 2024

జులై 5న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం: తలసాని

- Advertisement -
- Advertisement -

Balkampet Yellamma

మనతెలంగాణ/ హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని జులై 5వ తేదీన వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. మంగళవారం మాసాబ్ ట్యాంక్‌లోని మంత్రి కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కళ్యాణం నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జులై 4వ తేదీన ఎదుర్కోళ్ళు, 5వ తేదీన కల్యాణం, 6న రథోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. అమ్మవారి కల్యాణాన్ని భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా టివీలలో చూసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

సిఎం కెసిఆర్ ఆదేశాలతో అమ్మవారి కల్యాణం, బోనాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పారిశుద్ధం, రహదారుల మరమ్మతులు వెంటనే చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రథోత్సవం వీలుగా విద్యుత్ లైన్‌లను సరిచేయడం, చెట్ల కొమ్మలను తొలగించడం చేపట్టాలని, ట్రాఫిక్ మళ్లింపు ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. అమ్మవారి దర్శనం, కల్యాణం కోసం ఇచ్చే పాస్‌లను డూప్లికేషన్‌కు ఆస్కారం లేకుండా బార్ కోడింగ్‌తో కూడిన పాస్‌లను జారీ చేయాలని ఆదేశించారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కల్యాణం అనంతరం ఆలయ అభివృద్ధికి సహకరించిన దాతలు, అధికారులను సన్మాన కార్యక్రమం ఉంటుందన్నారు. సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, ఈఓ అన్నపూర్ణ, ఆలయ కమిటీ సభ్యులు, డిఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకట్, ఆర్టీసీ ఆర్‌ఎం వెంకన్న, జలమండలి అధికారులు కృష్ణ, ప్రభు, ఆర్డీఓ వసంత, జోనల్ కమిషనర్ రవికిరణ్, అధికారులు రంగారావు, గణేష్, సిఐ సైదులు, రవీంద్రమోహన్, పాపయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Balkampet Yellamma Kalyanotsavam on July 5th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News