Thursday, January 23, 2025

వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. కల్యాణ మహోత్సవానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. అమ్మవారికి ప్రభుత్వం తరఫున మంత్రి కొండా సురేఖ పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారిని 27 చీరలు, స్వామివారికి 11 పంచెలతో అలంకారం చేశారు. బల్కంపేట ఎల్లమ్మను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మీ, రాజకీయ నేతలు దర్శించుకున్నారు. పొన్నం ప్రభాకర్ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పొన్నానికి స్వాగతం పలికే సమయంలో స్వల్పంగా తోపులాట జరిగింది. దీంతో ప్రొటోకాల్ పాటించకపోవడంతో పొన్నం అలకబూనారు. కలెక్టర్ అనుదీప్‌కు పొన్నం ప్రభాకర్ ఫోన్ చేసి అసహనం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News