Monday, January 20, 2025

విజయవంతంగా అగ్ని క్షిపణి పాటవ పరీక్ష

- Advertisement -
- Advertisement -

Missile Agni Prime follow-up test

బాలాసోర్: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మధ్యశ్రేణి విధ్వంసక క్షిపణి అగ్ని ప్రైమ్ పాటవ పరీక్షను శుక్రవారం ఒడిశా తీరం నుంచి డిఆర్‌డిఓ విజయవంతంగా నిర్వహించింది. ఉదయం 9.45 గంటల ప్రాంతంలో అబ్దుల్ కలామ్ దీవి నుంచి మొబైల్ లాంఛర్ ద్వారా ఈ క్షిపణిని ప్రయోగించినట్లు డిఆర్‌డిఓ వర్గాలు తెలిపాయి. ఘన ఇంధనంతో నడిచే ఈ క్షిపణి పాటవ పరీక్షలో అన్ని అంశాలలో విజయవంతం అయినట్లు వారు చెప్పారు. వివిధ పాయింట్ల వద్ద అమర్చిన రాడార్లు, టెలిమెట్రి పరికరాలలో క్షిపణి గమనం రికార్డు అయినట్లు అధికారులు తెలిపారు. ఈ క్షిపణి 1,000 నుంచి 2,000 కిలోమీటర్ల మధ్య దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదని వారు వివరించారు. ఇదే ప్రాంతం నుంచి గత ఏడాది డిసెంబర్ 18న ఈ క్షిపణి విజయవంతంగా పాటవ పరీక్ష జరుపుకున్నట్లు వారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News