Sunday, January 19, 2025

బల్మూరి వెంకట్, మహేశ్ కుమార్ గౌడ్‌ ఏకగ్రీవ ఎన్నిక

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు స్థానాలకు ఎమ్మెల్సీలుగా బల్మూరి వెంకట్, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రతిపక్ష బిఆర్‌ఎస్ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇద్దరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ పదవులకు ఇతర పార్టీల నుంచి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో వీరిద్దరూ ఎన్నిక అయినట్లు అసెంబ్లీ సెక్రటరీ నరసింహచార్యులు సోమవారం ప్రకటించారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన బల్మూరి వెంకట్ ధృవీకరణ పత్రం తీసుకునేందుకు అసెంబ్లీకి అభిమానులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లారు. ఎమ్మెల్సీలుగా ఎన్నికైన మహేష్ గౌడ్, వెంకట్‌లకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News