Thursday, January 23, 2025

గ్రూప్-2 వాయిదాపై టిఎస్‌పిఎస్‌సి వెబ్ నోట్ ఇవ్వలేదు: బల్మూరి వెంకట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గ్రూప్-2 వాయిదాపై టిఎస్‌పిఎస్‌సి వెబ్ నోట్ ఇవ్వలేదని కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ తెలిపారు. అధికారికంగా వెబ్ నోట్ ఇచ్చే వరకు వాయిదాను నమ్మలేమన్నారు. ఆదివారం బల్మూరి వెంకట్ మీడియాతో మాట్లాడారు. గ్రూప్-2 వాయిదాపై మంత్రి కెటిఆర్ మాత్రమే ట్వీట్ చేశారని గుర్తు చేశారు. పేపర్ లీక్ సమయంలో టిఎస్‌పిఎస్‌సి స్వతంత్ర సంస్థ అని మంత్రి కెటిఆర్ అన్నారని, ఇప్పుడేమో గ్రూప్-2 వాయిదాపై టిఎస్‌పిఎస్‌సిని కోరారని వెంకట్ చురకలంటించారు. విద్యార్థులకు మద్దతు ఇచ్చిన అశోక్‌పై కేసులు పెట్టారని వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News